- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kavitha: రేవంత్, రాహుల్‌కు ఎమ్మెల్సీ కవిత సవాల్
ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి కవిత చాలెంజ్ విసిరారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కులగణన సర్వేకు సంబంధిం ప్రభుత్వం వద్ద 88 కోట్ల పేజీల డేటా ఉందని ఈ సర్వే ఆధారాలపై ఎవరనైనా సవాల్ చేస్తే అందుకు తగిన ఆధారాలు ప్రభుత్వం వద్ద పక్కాగా ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన చాలెంజ్ కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ (MLC Kavitha) ఇచ్చారు. ఈ సర్వేపై నిన్న కాంగ్రెస్ ఎంపీలకు ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా సీఎం చేసిన వ్యాఖ్యలపై కవిత ఇవాళ ఎక్స్ వేదికగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవుంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో నిర్వహించి సర్వే ప్రభుత్వం చెబుతున్నట్లుగా సమాజం యొక్క ఎక్స్ రేనో, సిటీ స్కానో కాదాని ఇది కాంగ్రెస్ చేస్తున్న అత్యుత్తమ కుట్ర అని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడనమేనని ఆరోపించారు.
ప్రభుత్వ డేటా సేకరణ ప్రక్రియ పారదర్శకంగా లేదని అనేక వ్యత్యాలాలు కలిగి ఉందన్నారు. తెలంగాణలో ఓబీసీలు (ముస్లింలు లేకుండా) 2014 క్యాస్ట్ డేటా ప్రకారం 52 శాతం ఉండే 2024 లో అది 46 శాతానికి ఎలా తగ్గిందని ప్రశ్నించారు. తాను ప్రస్తావిస్తున్నది ఒక వ్యత్యాసం మాత్రమేనని ఇలాంటి వైరుధ్యాలు ఇంకా చాలా ఉన్నాయన్నారు. మీరు చెబుతున్న 'రారే' డేటా నిజమైతే గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో గ్రామాల వారీగా కులాల వారీ డేటాను ప్రదర్శించాలని రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి (Rahul Gandhi) చాలెంజ్ చేశారు. దాంతో నీళ్లకు నీళ్లు పాలకు పాలు తేలిపోతాయన్నారు.






