- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kavitha: దమ్ముంటే ఆ లెక్కలు బయటపెట్టు.. సీఎం రేవంత్ రెడ్డికి కవిత చాలెంజ్
సీఎం రేవంత్ రెడ్డికి కవిత చాలెంజ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో నిర్వహించిన కులగణన వివరాలను గ్రామ పంచాయతీల వారీగా బయటపెట్టాలని డిమాండ్ చేస్తుంటే వాటిని బయట పెట్టకుండా ‘కాంపోజిట్ బ్యాక్‌వర్డ్‌నెస్ ఇండెక్స్- సీబీఐ’ పేరుతో స్వతంత్ర కమిటీ పేరుతో మళ్లీ పాత లెక్కలనే ప్రభుత్వం ఇస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. కులగణన విషయంలో ప్రభుత్వం చెబుతున్న లెక్కలు నిజమైనవే అనే ధైర్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంటే గ్రామ పంచాయతీల వారీగా గణాంకాలు బయటపెట్టాలని చాలెంజ్ చేశారు. బీసీ బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలనే డిమాండ్ తో ఈ నెల 17న తెలంగాణ జాగృతి, యూనైటెడ్ ఫ్రంట్ ఫూలే ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రైల్ రోకో కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ను కవిత ఇవాళ జూబ్లిహిల్స్ లోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత ప్రభుత్వం ఇదివరకే షమీమ్ అక్తర్, బూసాని కమిటీలను వేసి ఆ వివరాలు బయటపెట్టలేదు. కులగణన వివరాలను గ్రామాల వారీగా బయటపెట్టకుండా మీడియాకు మళ్లీ తప్పుడు లెక్కలు ఇస్తున్నారని మండిపడ్డారు. జూలై 17న రైల్ రోకో నిర్వహించి తెలంగాణ నుంచి ఢిల్లీ వెళ్ళే ప్రతి రైలును ఆపి నిరసన కార్యక్రమం విజయవంతం చేస్తామని బీసీ రిజర్వేషన్ బిల్లు సాధించేందుకు బీజేపీపై ఒత్తిడి తెస్తామన్నారు. రైల్ రోకో కార్యక్రమానికి బీఆర్ఎస్ మద్దతు ఉంటుందా అని మీడియా అడిగిన ప్రశ్నకు కవిత సమాధానం ఇస్తూ.. నేనే బీఆర్ఎస్ పార్టీ అని రైల్ రోకోకు బీఆర్ఎస్ సపోర్ట్ ఉంటుందన్నారు.
కాంగ్రెస్, బీజేపీ చొరవ తీసుకోవాలి:
బీసీ బిల్లు ఆమోదం కోసం బీజేపీ చొరవ తీసుకోవాలని తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు రామచందర్ రావు కు ఈ విషయంలో నిన్ననే లేఖ రాశామన్నారు.
ఆయన చొరవ తీసుకోనీ బీజేపీ అధ్యక్ష హోదాలో తొలి విజయం నమోదు చేసుకోవాలని కవిత సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి ఖార్జున్ ఖర్గే హైదరాబాద్ వస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చెయ్యకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ బీసీల కోసం పార్లమెంట్ లో ఎన్నడు మాట్లాడలేదని విమర్శించారు. బీసీలకు 42 రిజర్వేషన్ అమలు అయ్యేలా బీజీపీపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తూ ఖర్గేకు సైతం లేఖ రాసినట్లు చెప్పారు.
చంద్రబాబు కోవర్టుల అంశంపై.. బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరి కనబరుస్తోందని కవిత విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారని కొందరి కాంట్రాక్ట్ లు కోసమే బనకచర్ల ప్రాజెక్ట్ అంటూ అనిరుధ్ రెడ్డి మాట్లాడారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారని కూడా అన్నారని ఇకనైనా రేవంత్ రెడ్డి బనకచర్ల ను ఆపాలని గట్టిగా కొట్లాడాలన్నారు.






