- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kavitha: మండలిలో బీఆర్ఎస్‌కు షాకిచ్చిన కవిత.. త్వరలో జరగబోయేది అదేనా?
అసెంబ్లీలో కవిత వైఖరి చర్చనీయాంశంగా మారింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే (Caste Census Survey) ప్రతిపక్ష బీఆర్ఎస్(BRS) లో దుమారం రేపుతున్నది. ఈ సర్వే నివేదికను ఇవాళ ప్రభుత్వం అసెంబ్లీలో చర్చకు పెట్టింది. ఈ సందర్భంగా మండలిలో బీఆర్ఎస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. సర్వేలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ జనాభాను తగ్గించి చూపిందని దీనికి నిరసనగా తామంతా వాకౌట్ చేస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శాసన మండలి (Legislative Council) నుంచి వాకౌట్ చేశారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వాకౌట్ చేసినా కవిత (Kavitha) మాత్రం తాను వాకౌట్ చేయకుండా సభలోనే ఉండిపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇక ఇదిలా ఉంటే కులగణనపై ఇవాళ బీసీ సంఘాలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భేటీ కావాలని కేసీఆర్(KCR) నుంచి ఆదేశాలు వచ్చాయనే ప్రచారం జరిగింది. కానీ కేటీఆర్ (KTR)కంటే ముందే కవిత తని నివాసంలో బీసీ నేతలతో సమావేశం కావడం కూడా బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక తాజాగా మండలిలో పార్టీ నేతలంతా వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయినా కవిత వెళ్లకపోవడంతో సొంత పార్టీకే ఆమె మరోసారి షాకిచ్చారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది. దీంతో కవిత బీఆర్ఎస్ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నారా భవిష్యత్ లో ఆమె తన సొంత లైన్ లోనే వెళ్లాలనే ఆలోచనతో ఉన్నారా అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి.






