తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీని ప్రకటించిన కవిత

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-02 11:48:37  IST  )

తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ప్రకటించారు.

తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీని ప్రకటించిన కవిత
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీని (Telangana Jagruthi Teachers Federaton Committee) జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ప్రకటించారు. ఫెడరేషన్ నూతన కమిటీ అధ్యక్షులుగా మోరం వీరభద్రరావు, ఉపాధ్యక్షులుగా బుర్ర రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి జాడి శ్రీనివాస్, కోశాధికారిగా ఘనపురం దేవేందర్ లను నియమిస్తున్నట్లు ఎక్స్ (X) వేదికగా వెల్లడించారు. వెంటనే వీరి నియామకాలు అమల్లోకి వస్తాయని కవిత తెలిపారు. తెలంగాణ సమాజ అభ్యున్నతి కోసం, నవ తెలంగాణ నిర్మాణం కోసం శ్రమిస్తున్న సంస్థ తెలంగాణ జాగృతి అని పేర్కొన్నారు. నూతన కమిటీకి నియమితులైన బాధ్యులు విద్యారంగ వికాసానికి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు.

Next Story