Kavitha: బస్సు ఎక్కడమే పాపమా? టికెట్ చార్జీల పెంపుపై కవిత ఫైర్

by Prasad Jukanti |   (  Updated:2025-10-05 05:37:45  IST  )

గ్రీన్ జర్నీ పేరుతో సామాన్యుల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారని కవిత మండిపడ్డారు.

Kavitha: బస్సు ఎక్కడమే పాపమా? టికెట్ చార్జీల పెంపుపై కవిత ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ సిటీ ఆర్టీసీ బస్సుల్లో చార్జీలు పెంచడం (TSRTC Bus fare hike) పట్ల తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు ఎక్కడమే పాపమా? సామాన్య ప్రజలంటే ఎందుకింత కోపం ముఖ్యమంత్రి గారు? అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఇవాళ ఎక్స్ వేదికగా పోస్టు చేసిన కవిత.. మొన్నటికి మొన్న సిటీ బస్ పాస్‍ల ధరలు భారీగా పెంచి చిరుద్యోగులు, నగర ప్రజలపై పెనుభారం మోపారు. ఇప్పుడు బస్ చార్జీలను అమాంతం పెంచేశారని ధ్వజమెత్తారు. బస్సు ఎక్కడమే పాపం అన్నట్టుగా ప్రజల జేబులను గుల్ల చేస్తున్నారని గ్రీన్ జర్నీ పేరుతో సామాన్యుల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారని మండిపడ్డారు.

కాగా గ్రేటర్ హైదరాబాద్‍లో స్టేజీల వారీగా రూ.5 నుంచి రూ.10 మేర టికెట్ ధరలు పెంచారు. ఆర్డీనరీ, మెట్రో సహా అన్ని రకాల బస్సులకు ఈ పెంపు వర్తింప చేయనున్నారు. కొత్త ధరలు రేపటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. తాజా పెంపుతో సిటీ ఆర్డినరీలో ఇకపై కనీస టికెట్ ధర రూ. 15గా ఉండనుంది.

Next Story