- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kavitha: బెంగళూరులోనే తేల్చుకొని తెలంగాణకు రావాలి.. సీఎం రేవంత్‌కి కవిత కీలక సూచనలు
సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత కీలక సూచనలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం కర్ణాటకకు వెళ్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అస్వస్థతకు గురవడంతో ఆయనను పరామర్శించేందుకు సీఎం బెంగళూరుకు వెళ్లనున్నారు. అలాగే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో పాటు, సుప్రీంకోర్టులో విచారణ అంశాలు ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కీలక సూచనలు చేశారు.
ఈ మేరకు ఆమె సోమవారం తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. ‘కర్ణాటక పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఖర్గేతో చెప్పించి ఆల్మట్టి ఎత్తు తగ్గించుకొని రండి. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చేసే ఆల్మట్టి ప్రాజెక్టుపై ఎందుకు మీరు గొంతు విప్పడం లేదు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. మీ రెండు ప్రభుత్వాలకు కాంగ్రెస్ హైకమాండే బిగ్ బాస్. ఖర్గేని పరామర్శించి రాజకీయాలు మాట్లాడేందుకు కర్ణాటకకు వెళ్లిన రేవంత్ రెడ్డి.. మీ సొంత జిల్లా సహా దక్షిణ తెలంగాణకు చుక్క నీళ్లు రాకుండా చేసే ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపుపై బెంగళూరులోనే తేల్చుకొని తెలంగాణకు రండి, ఖర్గేని ఒప్పించి.. మెప్పించి ఆయనతో కర్ణాటక ముఖ్యమంత్రికి స్పష్టమైన డైరెక్షన్ ఇప్పించండి, ఆల్మట్టి ఎత్తు తగ్గింపు పై స్పష్టమైన ప్రకటనతోనే, మీరు తెలంగాణలో అడుగు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం’ అని కవిత పేర్కొన్నారు.






