- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
“సిద్దిపేట మోడల్ చిలిపి లీలలు”.. కవిత టీమ్ సంచలన ట్వీట్
బీఆర్ఎస్ బహిష్కృత నేత కవిత ఇటీవల మాజీ మంత్రి ఆ పార్టీ నేత హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. హరీష్ రావు, సంతోష్ రావుల వల్లనే పార్టీకి నష్టం జరుగుతోందని ఆరోపించారు.

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ బహిష్కృత నేత కవిత ఇటీవల మాజీ మంత్రి ఆ పార్టీ నేత హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. హరీష్ రావు, సంతోష్ రావుల వల్లనే పార్టీకి నష్టం జరుగుతోందని ఆరోపించారు. హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారని అన్నారు. అంతే కాకుండా కేసీఆర్‌ను ఓడించి తానే సీఎం అవ్వాలని కుట్ర చేశారని కూడా ఆరోపించారు. ఇలా ఎన్నో ఆరోపణలు చేయగా కవిత టీమ్ ట్విట్టర్ ద్వారా ఎపిసోడ్ లుగా కొన్ని విషయాలను బయటపెడుతుంది.
పార్టీలో జరిగిన కొన్ని విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. కవితక్క అప్డేట్స్ అనే ట్విట్టర్ పేజీ తాజాగా మరోసారి సంచలన ట్వీట్ చేసింది. సిద్దిపేట మోడల్ చిలిపి లీలలు అనే టైటిల్ ఎలా ఉందని పోస్టులో పేర్కొంది. రాజకీయం దిగజారి చేస్తున్నారు, మీరు దూరిన సంధులు గొందుల గురించి మాట్లాడే పరిస్థితి తెచ్చుకోకండి అంటూ పోస్ట్ లో హెచ్చరించారు. కవితపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా కామెంట్లు, పోస్టులు పెడుతున్నవేళ ఈ పోస్ట్ సంచలనంగా మారింది.






