- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ రెడ్డి కర్కోటక సీఎం.. గవర్నర్‌తో భేటీ అనంతరం కవిత ఫైర్
ట్రిపుల్ ఆర్, పరిగి, వెలుగుమట్ల భూ నిర్వాసితులతో కలిసి కల్వకుంట్ల కవిత గవర్నర్‌ను కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై తీవ్రంగా మండిపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో దుర్మార్గపు ప్రభుత్వం పాలన చేస్తోందని రేవంత్ రెడ్డి కర్కోటక ముఖ్యమంత్రి అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఆడబిడ్డల ఇళ్లను కూల్చుతూ వారికి మనశాంతి లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇవాళ ధర్మసమాజ్ పార్టీ చీఫ్ విశారదన్ తో పాటు వెలుగుమట్ల, కడ్లాపూర్, ట్రిపుల్ ఆర్ బాధితులతో పాటు లోక్ భవన్ లో గవర్నర్ రాజీవ్ ప్రతాప్ శుక్లాను కలిశారు. వెలుగుమట్లలో ఇండ్లు కోల్పోయిన బాధితులందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలని, పరిగి మండలం కడ్లాపూర్‌లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు జారీ చేసిన భూసేకరణ నోటీసులను రద్దు చేయాలని, ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్పు మరియు భూసేకరణ సమస్యలపై బాధితులతో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం లోక్ భవన్ ఎదుట మీడియాతో మాట్లాడిన కవిత మా పోరాటం కారణంగా ఖమ్మంలోని వెలుగుమట్లలో బాధితులకు అదే చోట ల్యాండ్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని పరిగి, ట్రిపుల్ ఆర్ కోసం భూసేకరణ చేసే పనిని ఆపేసిందన్నారు. ఇవ్వన్నీ కూడా మాకు పాక్షిక విజయాలని పూర్తి స్థాయిలో విజయం సాధించాలంటే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ మెంట్ అవసరం ఉందన్నారు. అందుకే గవర్నర్‍ను కలిసి వారికి ఈ అంశాలను వివరించామని వా విజ్ఞప్తులపై రిపోర్ట్ తెప్పించుకోని ఆయన సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు.
ఆ విషయం తెలిసి గవర్నర్ ఆశ్చర్యపోయారు:
వెలుగుమట్ల, పరిగి, ట్రిపుల్ ఆర్ బాధితుల తరఫున ఇద్దరిద్దరు రిప్రజేంటేషన్ ఇచ్చేందుకు వచ్చారుని, టీఆర్ఎస్ నేతలు, ధర్మ సమాజ్ పార్టీ నేతలు కూడా వచ్చారని కవిత తెలిపారు. మేమంతా కూడా గవర్నర్ గారిని భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని అడిగామని మేము చెప్పిందంతా విని సానుకూలంగా స్పందించారన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తామని అప్పటికీ కూడా బాధితులకు న్యాయం చేయకపోతే మళ్లీ పోరాటబాట పడుతామన్నారు. గవర్నర్ కు సమస్యలు విన్నవించినప్పటికీ గతంలో ఏమీ స్పందన లేదన్న దానికి మేము ఏమీ చేయలేమన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్న అన్ని దారుల ద్వారా మేము మా పోరాటాన్ని చేస్తున్నామన్నారు. ట్రిపుల్ ఆర్‍కు సంబంధించి నాలుగు సార్లు అలైన్ మెంట్ మార్చిన విషయం పట్ల గవర్నర్ ఆశ్చర్యపోయారన్నారు. కిషన్ రెడ్డి ట్రిపుల్ ఆర్ కోసం ఇచ్చిన లెటర్‍ను కూడా గవర్నర్‍కు చూపించామన్నారు. గవర్నర్ ద్వారా న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని లేదంటే భవిష్యత్‍లో ఉమ్మడి కార్యాచరణ ద్వారా పోరాటాలు చేస్తామన్నారు.
ఢిల్లీ ఫ్లైట్‍లో నుంచి ఏమీ కనబడటం లేదేమో?:
వంద రూపాయల చీర ఇచ్చి ఆడవాళ్లను కోటీశ్వరులు చేస్తున్నామంటూ ఈ కర్కోటక ముఖ్యమంత్రి అబద్దాలు చెబుతున్నారని, ఆడబిడ్డల ఇళ్లను కూలగొట్టి వారికి మనశ్శాంతి లేకుండా చేశారన్నారు. వెలుగుమట్లలో ఇళ్లు కూల్చుతుంటే ఓ మహిళకు గర్భస్త్రావం అయ్యింది. వాళ్ల భర్త రోదన ఇప్పటికీ మాకు వినబడుతూనే ఉందన్నారు. కల్లాలలో రైతుల ధాన్యం అలాగే ఉందని ఈ ముఖ్యమంత్రి విమానంలో ఢిల్లీకి వెళ్తూ ఫ్లైట్ నుంచి చూస్తే ఆయనకు ఏమీ కనబడటం లేదేమో? అని ఎద్దేవా చేశారు. రైతు లేకపోతే మనకు బుక్కెడు బువ్వ కూడా ఉండదు. ఏ జిల్లాలో చూసిన కల్లాల్లో ధాన్యం అలాగే ఉంది. ఒక్క రైతు కూడా సంతోషంగా లేడు. వెంటనే రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.






