ఆంధ్ర, తెలంగాణ‌ రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి: కవిత

by Ajay Maddhiboyina |

తెలంగాణ జ‌గృతి అధ్య‌క్షురాలు క‌విత నేడు తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. భ‌ర్త అనిల్‌తో కలిసి కవిత తిరుమలకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఆంధ్ర, తెలంగాణ‌ రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి: కవిత
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ జ‌గృతి అధ్య‌క్షురాలు క‌విత నేడు తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. భ‌ర్త అనిల్‌తో కలిసి కవిత తిరుమలకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నెల 25వ తేదీ నుండి నాలుగు నెలల పాటు జాగృతి జ‌నంబాట అనే కార్య‌క్ర‌మం కొన‌సాగుతుంద‌ని చెప్పారు. ఆ కార్య‌క్ర‌మం విజ‌యవంతం అవ్వాల‌ని స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నాన‌ని అన్నారు.

ఎప్పుడైనా తెలంగాణ‌, ఆంధ్ర రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాల‌ని కోరుకుంటాన‌ని, ఇప్పుడు కూడా అదే కోరుకున్నాన‌ని చెప్పారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయిన త‌ర‌వాత క‌విత ఆ పార్టీకి మ‌రింత దూరం అయ్యారు. జాగృతి ద్వారా అనేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ జ‌నంలోకి వెళుతున్నారు. ఇప్ప‌టికే అవ‌స‌ర‌మైతే కేసీఆర్‌తో పోటీకి సైతం సిద్ధం అని ఇకపై బీఆర్ఎస్‌తో కలిసేది లేదని తేల్చిచెప్పారు. దీంతో కవిత రాజకీయ జీవితంపై ఒక క్లారిటీకి వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సొంతంగా పార్టీని బలోపేతం చేసుకుంటున్నారని అర్థం అవుతోంది.

Next Story