- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గెలిపించకపోతే భార్య, బిడ్డతో ఉరేసుకుంటా.. కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నేటితో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న క్రమంలో ఎన్నికల వేడి అంతా ఇంతా కాదు అభ్యర్థుల్లో టెన్షన్ పెడుతుంది.

దిశ, కమలాపూర్ / హుజురాబాద్: నేటితో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న క్రమంలో అభ్యర్థుల్లో టెన్షన్ పీక్స్‌కు చేరుకుంది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఉద్వేగంగా ప్రసంగించారు. ఈసారి తనను గెలిపించకపోతే భార్యా, బిడ్డతో కలిసి ఉరివేసుకుంటానని వేడుకున్నారు. చంపుకుంటారో, సాదుకుంటారో మీ ఇష్టమని హాట్ కామెంట్స్ చేశారు. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడతాయని, ఫలితాలలో తనను గెలిపిస్తే జయయాత్ర, ఓడితే మరుసటి రోజు శవయాత్ర అని ఆవేదన వ్యక్తంచేశారు.
మీ కడుపులో తల పెట్టీ అడుగుతున్నా.. మీ కాళ్ళు మొక్కుతా.. ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. ఒక్కసారి ఓటేసి బతికించుకుంటారో.. వెయ్యకుండా సంపుకుంటరో.. తేల్చుకోవాలన్నారు. గతంలో ఈటల సైతం ఇలాగే ‘సంపుకుంటరో.. సాదుకుంటరో’ అని ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కౌశిక్ రెడ్డి సైతం అదే ఫార్ములాను ప్రచారం ముగింపు వేళ చివరి అస్త్రంగా ప్రయోగించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఒక్క సారి తనకు అవకాశం కల్పించాలని 30వ తేదీన కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.






