KTR : కౌశిక్ రెడ్డి అరెస్ట్ దుర్మార్గమైన చర్య : కేటీఆర్

by Muthe.Rajitha |

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Koushik Reddy) అరెస్ట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సీరియస్ అయ్యారు.

KTR : కౌశిక్ రెడ్డి అరెస్ట్ దుర్మార్గమైన చర్య : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Koushik Reddy) అరెస్ట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సీరియస్ అయ్యారు. కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. పూటకో అక్రమ కేసు పెట్టడం.. రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్టుచేయడం రేవంత్ సర్కారుకు ఓ అలవాటుగా మారిందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి దిగజారుడు పనులకు దిగుతున్నారని అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను వెనకేసుకొచ్చి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఏకపక్షంగా అరెస్టుచేయడం పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలో రైతురుణమాఫీని ఎగ్గొట్టి, దళితబంధుకు పాతరేసిన కాంగ్రెస్ సర్కారును ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకే ముఖ్యమంత్రి ఈ అణచివేత చర్యలకు దిగుతున్నారని వెల్లడించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన సీఎం రేవంత్ రెడ్డిపై చర్య తీసుకోవాల్సిందిపోయి ప్రజల పక్షాన ప్రశ్నించిన కౌశిక్ రెడ్డిపై కేసులు పెట్టడమే మీ ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు. పోరాటాలే ఊపిరిగా పుట్టిన గులాబీ పార్టీ నేతల ఆత్మస్థయిర్యాన్ని ఇలాంటి చిల్లర చేష్టలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ దెబ్బతీయలేదని.. అక్రమంగా అరెస్టు చేసిన తమ ఎమ్మెల్యేను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Next Story