- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రెండింగ్‌లో ‘కట్టెల పొయ్యి’.. సోషల్ మీడియాను తగలబెట్టేస్తోందిగా..!
దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా గ్యాస్ సరఫరాలో ఏర్పడిన తీవ్ర అంతరాయం సామాన్యుడి వంటగదిని చిన్నాభిన్నం చేస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా గ్యాస్ సరఫరాలో ఏర్పడిన తీవ్ర అంతరాయం సామాన్యుడి వంటగదిని చిన్నాభిన్నం చేస్తోంది. గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా పల్లెల నుండి పట్టణాల వరకు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే దశాబ్దాల క్రితం వాడిన 'కట్టెల పొయ్యి' మళ్లీ తెరపైకి రావడమే కాకుండా, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. గ్యాస్ స్టవ్‌లు వెలవెలబోతుండటంతో, గత్యంతరం లేక బాల్కనీల్లో, ఇంటి ఆవరణల్లో ఇటుకలతో పొయ్యిలు ఏర్పాటు చేసుకుంటున్న ఫోటోలను నెటిజన్లు షేర్ చేస్తున్నారు.
ఆధునిక యుగంలోనూ కట్టెల పొయ్యి..
#LPGShortage, #KattelaPoyyi, #BackToOldDays వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ప్రస్తుతం ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. "గ్యాస్ ధరలు పెరిగినప్పుడు బాధపడ్డాం.. కానీ ఇప్పుడు ధర ఉన్నా గ్యాస్ దొరకని పరిస్థితి వచ్చింది" అంటూ వినియోగదారులు తమ ఆవేదనను మీమ్స్ రూపంలో వ్యక్తపరుస్తున్నారు. ఆధునిక యుగంలోనూ కట్టెల పొయ్యి మీద వంట చేయడం అనేది ఒక 'సర్వైవల్ స్కిల్' (మనుగడ కోసం విద్య)గా మారిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు.. గ్యాస్ లేకపోవడంతో చాలా మంది ఇండక్షన్ స్టవ్‌ల వైపు మొగ్గు చూపుతుండగా, విద్యుత్ కోతలు ఉన్న ప్రాంతాల్లో మాత్రం కట్టెల పొయ్యియే దిక్కవుతోంది. బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో పలు చిన్న తరహా హోటళ్లు గ్యాస్ కొరత వల్ల మూతపడగా, కొన్ని చోట్ల సంప్రదాయ పద్ధతుల్లో వంట చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు.
గ్యాస్ కొరతకు కారణం..?
ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, హార్ముజ్ జలసంధి మూసివేత వంటి అంతర్జాతీయ పరిణామాల వల్ల భారత్‌కు చమురు మరియు గ్యాస్ దిగుమతులు తగ్గడమే ఈ కొరతకు ప్రధాన కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం సిలిండర్ల కోసం వినియోగదారులు రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.






