- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్పీడ్ పెంచిన కాసాని.. అసెంబ్లీలకు కో-ఆర్డినేటర్ల నియామకం
by Satheesh |
టీడీపీని ప్రజల్లోకి తీసుకెళ్లి పూర్వవైభవం చాటేందుకు పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుంది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: టీడీపీని ప్రజల్లోకి తీసుకెళ్లి పూర్వవైభవం చాటేందుకు పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే బుధవారం పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్లను నియమించింది. అందుకు సంబంధించిన నియామక ఉత్తర్వులను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ జారీ చేశారు. మల్కాజ్ గిరి అసెంబ్లీ నియోజకవర్గానికి జిల్లా శంకర్, సి.సంతోష్ సాగర్, బి. నర్సింహాగౌడ్, సి.నరేష్ ముదిరాజ్, నల్లగొండ అసెంబ్లీ ఇన్ చార్జీగా ఎల్వీయాదవ్, తుంగతుర్తి అసెంబ్లీకి ఆకారపు రమేష్‌ను నియమించారు. త్వరలోనే మిగతా అన్ని నియోజకవర్గాలకు నియమించనున్నట్లు తెలిపారు. పార్టీ పటిష్టతకు పాటు పడేవారికే పార్టీ పదవుల్లో గుర్తింపు ఇస్తామని కాసాని స్పష్టం చేశారు. ఇప్పటికే పార్టీ నేతల పనితీరును నిత్యం గమనిస్తున్నామని తెలిపారు.
Next Story






