- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భద్రతా బలగాల ఆధీనంలోకి కర్రిగుట్టలు.. మూడు బేస్ క్యాంపుల ఏర్పాటు
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ (Telangana-Chhattisgarh) రాష్ట్రాల సరిహద్దులో ఉన్న కర్రిగుట్ట (Karriguttalu)ల్లో కేంద్ర బలగాలు చేపడుతోన్న కూంబింగ్ (Combing) నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ (Telangana-Chhattisgarh) రాష్ట్రాల సరిహద్దులో ఉన్న కర్రిగుట్ట (Karriguttalu)ల్లో కేంద్ర బలగాలు చేపడుతోన్న కూంబింగ్ (Combing) నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే చీమలు కూడా దూరని చిట్టడవిలో మావోయిస్టులు (Maoists) అమర్చిన మందుపాతరలు (Landmines), ఐఈడీ బాంబు (IED Bomb)లను ఐడెంటిఫై చేశాక వాటిని నిర్వీర్యం చేస్తూ భద్రతా దళాలు ముందుకు సాగుతున్నాయి. అదేవిధంగా మావోయిస్టులు (Maoists) ఏర్పాటు చేసుకున్న షెల్టర్లను గుర్తించి వాటిని నాశనం చేస్తున్నారు. మరోవైపు కర్రిగుట్టల్లో హత్యాకాండను ఆపాలంటూ పౌర హక్కుల సంఘాల నేతలు మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని కలిసిన పీస్ కమిటీ (Peace Committee) కర్రిగుట్టల్లో ఎన్‌కౌంటర్ (Encounter) ఆపేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని అభ్యర్థించింది.
ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్రిగుట్టల అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. ఈ మేరకు ధోబే కొండలు (Dhobey Hills), నీలం సరాయి (Neelam Sarai) కొండల్లో ఫార్వర్డ్ బేస్ క్యాంపు (Forward Base Camp)లను ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా అలుబాక (Alubaka) శివారులో మరో బేస్ క్యాంప్‌ను కూడా ఏర్పాటు ప్రక్రియి పూర్తి చేశారు. ఇక మావోయిస్టుల జాడను తెలుసుకునేందుకు డ్రోన్ల (Drones) కోసం ప్రత్యేక సిగ్నలింగ్ టవర్ల (Signaling Towers)ను నిర్మించారు. CRPFకు చెందిన ప్రత్యేక K9, K3 డాగ్ స్క్వాడ్ బృందాలతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కర్రిగుట్టల్లో వందల సంఖ్యలో మవోయిస్టులు భూగర్భ బంకర్లు ఉన్నట్లుగా సమాచారం అందడంతో ముందు ఆ బంకర్ల గుర్తింపునకు సీఆర్‌పీఎఫ్ (CRPF) దళాల వేట కొనసాగుతోంది.






