రేపు తెలంగాణకు CM సిద్ధరామయ్య.. టీ- కాంగ్రెస్ భారీ స్కెచ్

by Disha Web Desk 19 |
రేపు తెలంగాణకు CM సిద్ధరామయ్య.. టీ- కాంగ్రెస్ భారీ స్కెచ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఈ క్రమంలో కర్నాటకను టార్గెట్ చేసుకుని తెలంగాణ కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తున్న వేళ కర్నాటక నేతలతోనే కౌంటర్ ఇప్పించేందుకు కాంగ్రెస్ నేతలు వ్యూహ రచన చేస్తున్నారు. ఇప్పటికే ఏఐసీసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లు తెలంగాణలో పర్యటిస్తూ పార్టీ కోసం ప్రచారం చేస్తుండగా.. రేపు తెలంగాణలో కర్నాటక సీఎం సిద్దరామయ్య పర్యటించబోతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో సిద్ద రామయ్య ప్రచారం చేయబోతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ టూర్‌లో భాగంగా బీఆరెస్ నేతలు కర్ణాటక ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలపై రేపు గాంధీభవన్‌లో సిద్ధరామయ్య మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు.

Next Story

Most Viewed