- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైద్యం చేయించుకోలేక యువతి ఆత్మహత్య
ఆర్థిక సమస్యలతో వైద్యం చేయించుకోలేక ఒక యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

దిశ, ఎల్లారెడ్డిపేట: ఆర్థిక సమస్యలతో వైద్యం చేయించుకోలేక ఒక యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ముద్రకోల అంజలీ (19) అనే యువతి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని మృతిచెందింది. వివరాల ప్రకారం, అంజలీ తల్లి నాగమణి పూసల వ్యాపారం చేస్తూ నిత్యావసర వస్తువులు విక్రయించగా, తండ్రి శంకర్ వంట పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అంజలీ ఇంటర్ వరకు చదువుకుంది. ఇటీవల ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన వాలీబాల్ పోటీల్లో జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చింది. అయితే, ఇటీవల ఆమె ఫిట్స్ వ్యాధితో బాధపడుతూ వస్తోంది.
ఈ వ్యాధికి చికిత్స చేయించేందుకు అవసరమైన నిధులు లేకపోవడంతో, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని చూసి మనోవేదనకు గురై, మానసికంగా కుంగిపోయి ఈ ఘాతక నిర్ణయం తీసుకుంది. విషయం తెలిసిన వెంటనే ప్రొబేషనరీ ఎస్‌ఐ లక్ష్మణ్ ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ముద్రకోల అంజలీ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పూసల సంఘం జిల్లా నాయకులు మద్దివేణి శ్రీధర్, లక్ష్మణ్, కృష్ణ, సతీష్, దేవరాజ్, రమేష్, తిరుపతి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.






