భార్యతో గొడవపడి కెనాల్లో దూకిన యువకుడు.. చివరికి

by Bhanu |

భార్యతో గొడవపడి హుజురాబాద్ పట్టణంలోని కెనాల్ లో యువకుడు దూకిన సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..

భార్యతో గొడవపడి కెనాల్లో దూకిన యువకుడు.. చివరికి
X

దిశ, హుజురాబాద్ రూరల్: భార్యతో గొడవపడి హుజురాబాద్ పట్టణంలోని కెనాల్ లో యువకుడు దూకిన సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నకిరేకల్ కు చెందిన శివరాత్రి సైదులు (26) భార్యతో గొడవపడ్డాడు. గత కొంతకాలంగా స్థానికంగా బావులు తవ్వకాల్లో పనిచేస్తున్నారు.ఈ క్రమంలో భార్య సోదరుడు వచ్చి బెదిరించడంతో సైదులు కోపోద్రుక్తు డై సమీపంలోని కెనాల్లో దూకాడు. సమాచారం అందుకున్న ఫైర్, పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు.కెనాల్లో దూకి అపస్మారక స్థితిలో ఉన్న యువకుడ్ని స్థానికుల సహాయంతో బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితునికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story