- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సామాజిక స్పృహలో యువకులు
యువకులు సామాజిక స్పృహతో పాటు భక్తి మార్గంలో కూడా నడుస్తున్నారు. సీతారామ కళ్యాణానికి వచ్చిన భక్తులకు ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు.

దిశ, గోదావరిఖని : యువకులు సామాజిక స్పృహతో పాటు భక్తి మార్గంలో కూడా నడుస్తున్నారు. సీతారామ కళ్యాణానికి వచ్చిన భక్తులకు ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. శుక్రవారం గోదావరిఖని కోదండ రామాలయం వస్తున్న భక్తులకు సేవతో పాటు దాహార్తిని తీర్చేందుకు ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లను అందించారు. సింగరేణి ఏరియా ఆసుపత్రి ముందు ప్రిన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ, మంచినీళ్ల పంపిణీ చేశారు. ఫ్రెండ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రౌతు గణేష్, కోలేటి విశాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రౌత్ గణేష్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని, ప్రజలకు ఎల్లప్పుడూ తోడుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మీస వికాస్, హనుమాన్ల వెంకటేష్, రిషిక్ మార్క్ ఆశ్రిత్, పవన్, అక్షయ్, బన్నీ, బబ్లు, అభిలాష్, కార్తీక్ పాల్గొన్నారు.






