యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీనామా

by Nallavelli.Anjaneyulu |

మున్సిపల్ ఎన్నికలలో టికెట్ రాకపోవడంతో రాయికల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని నాగరాజు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవీకి రాజీనామా చేశాడు.

యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీనామా
X

దిశ, రాయికల్ : మున్సిపల్ ఎన్నికలలో టికెట్ రాకపోవడంతో రాయికల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని నాగరాజు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవీకి రాజీనామా చేశాడు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేసిన పార్టీలో గుర్తింపు లేదని అన్నారు. రాయికల్ కౌన్సిలర్ గా పార్టీ టికెట్ తనకు కేటాయించకుండా ఇతరులకు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ జెండా మోసిన వారికి పార్టీలో గుర్తింపు లేదని వలస వచ్చిన నాయకులకి పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపించారు. తన రాజీనామాను జిల్లా అధ్యక్షుడు నందయ్య ఆమోదించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

Next Story