పిడుగుపాటుకు యువ గొర్ల కాపరి మృతి

by Bhanu |   (  Updated:2025-05-27 11:05:49  IST  )

పిడుగుపాటుకు ఓ యువ గోర్ల కాపరి మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.

పిడుగుపాటుకు యువ గొర్ల కాపరి మృతి
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : పిడుగుపాటుకు ఓ యువ గోర్ల కాపరి మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన దాసరి లక్ష్మణ్ (26) పిడుగుపాటు ఘటనలో మృతి చెందాడు. మంగళవారం రోజువారీగా ఇల్లంతకుంట మండలం గొల్లపల్లి గ్రామ శివారులోకి లక్ష్మణ్ గోర్ల కాపుకు వెళ్లగా ఈ ఘటన జరిగింది.

లక్ష్మణ్ తలపై పిడుగుపాటు పడగా అక్కడికడికి ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో విషాదం ఛాయలు అలుముకోగా స్థానికులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా మంగళవారం భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలోనే పలు చోట్ల పిడుగులు పడ్డాయి..

Next Story