పెళ్లి కావడం లేదని యువకుడు ఆత్మహత్య

by velandi.Saikiran |

పెళ్లి కావడం లేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు...పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన

పెళ్లి కావడం లేదని యువకుడు ఆత్మహత్య
X

దిశ,​ హుజురాబాద్ రూరల్: పెళ్లి కావడం లేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు...పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామంలో చోటు చేసుకుంది. ​గ్రామానికి చెందిన వేల్పకొండ పవన్ (29) తనకు పెళ్లి కావడంలేదని... తరచుగా స్నేహితుల వద్ద తన బాధను చెప్పుకునేవారు. ఈ తరుణంలోనే ఈ నెల 26న ఇంటి నుంచి బయటకు వెళ్లి, పురుగుల మందు తాగాడు. దింతో వెంటనే అతడిని హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పవన్ నేడు మరణించాడు. పవన్ సోదరుడు రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story