ప్రేమ పెళ్లి.. మొన్న భార్య, నేడు భర్త మృతి

by Kodari Anjali |   (  Updated:2025-10-21 15:27:04  IST  )

ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లాడిన ఓ యువ జంట నెలరోజుల కాలవ్యవధిలోనే మరణించిన ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో చోటుచేసుకుంది.

ప్రేమ పెళ్లి.. మొన్న భార్య, నేడు భర్త మృతి
X

దిశ, మెట్‌పల్లి/ఇబ్రహీంపట్నం: ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లాడిన ఓ యువ జంట నెలరోజుల కాలవ్యవధిలోనే మరణించిన ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామానికి చెందిన బోదాసు గంగోత్రి(22) అనే యువతీ ఈ నెల మూడో తేదీన భోజన సమయంలో వాగ్వాదం చోటుచేసుకుని మనస్థాపానికి గురై ఉరి వేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా భర్త బోదాసు సంతోష్(26) యువకుడు సైతం మంగళవారం మరణించాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామనికి చెందిన బోదాసు సంతోష్, గంగోత్రి లు నెల రోజుల క్రితం ప్రేమించి పెద్దలు నొప్పించి వారి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

అయితే దసరా పండక్కి సంతోష్ గంగోత్రిలో కలిసి గంగోత్రి తల్లి గారి ఇంటికి భోజనానికి అని వెళ్లారు. భోజన సమయంలో చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకోగా భర్త ఇంటికి తిరిగి వచ్చిన గంగోత్రి(22) ఈనెల రెండున ఆత్మహత్యకు పాల్పడింది. గంగోత్రి మరణాన్ని సంతోష్ జీర్ణించుకొక పోగా వారి ప్రేమను గుర్తు చేసుకుంటూ కృంగిపోయేసరికి సంతోష్‌ ని కొన్ని రోజులు తన బంధువుల ఇంటికి ఆదిలాబాద్‌కు తీసుకువెళ్లడంతో అక్కడ మంగళవారం సంతోష్ మరణ వార్త విని ఆదిలాబాద్‌కు పయనమయ్యారు. అయితే సంతోష్ ఎలా చనిపోవడం అనేది మాత్రం తెలియరాలేదు. కనీసం నెలరోజుల కాకముందే ప్రేమ జంట ఆత్మహత్య పై రెండు కుటుంబాల్లో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story