'మీరే గుంట నక్కలు.. మా సీఎం సింహం' : మంత్రి లక్ష్మణ్ కుమార్

by Ratna Kumari |

ప్రభుత్వం పై విషం కక్కుతూ మాట్లాడే వారు గుంట నక్కలేనని, ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సింహమని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మీరే గుంట నక్కలు.. మా సీఎం సింహం : మంత్రి లక్ష్మణ్ కుమార్
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : ప్రభుత్వం పై విషం కక్కుతూ మాట్లాడే వారు గుంట నక్కలేనని, ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సింహమని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జగిత్యాల లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బీఆర్ఎస్ పాలనలో పదేళ్లు రాచరిక పాలన సాగిందని, కొండగట్టు బస్సు ప్రమాదంలో 60 మంది మరణించినప్పటికీ అప్పటి సీఎం కేసీఆర్ కనీసం పరామర్శకు రాలేదని అన్నారు.

ఇక కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని అన్నారు. సీఎంను ఏకవచనంతో సంబోధించడం తగదని హెచ్చరించిన మంత్రి, ఇలాంటి భాషను సహించబోమన్నారు. ధర్మపురికి వస్తే తాను చేసిన అభివృద్ధి చూపిస్తానని సవాల్ విసిరారు. అలాగే తాను సిరిసిల్లకు వెళ్లి నేరెళ్ల దళితులపై జరిగిన దాడిపై ప్రశ్నిస్తానని, అప్పటి మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 15 వేల మందికి సరిపడే గ్రౌండ్‌లో లక్ష మందితో సభ అంటున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనను క్రాస్ బ్రీడ్ నాయకుడు అని సంబందించడంపై ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటీఆర్ అక్రమ సంపాదనతో వచ్చిన అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అలాంటప్పుడు గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రశేఖర్ గౌడ్ ను నిలబెట్టి జీవన్ రెడ్డి కి క్రాస్ ఓటు వేయించిన కేటీఆరే క్రాస్ బ్రీడ్ నాయకుడని అన్నారు. మీ పార్టీని అనేకసార్లు విమర్శించి కేటీఆర్ లోఫర్ అని సంబోధించినందుకు జీవన్ రెడ్డిని పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారా ప్రశ్నించారు. 2014లో పార్టీ పిలిచి టికెట్ ఇస్తేనే తాను పోటీ చేసినట్లు గుర్తు చేశారు. విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నానని కేటీఆర్ రాజకీయాల్లోకి రాకముందు నుంచే తన కుటుంబం పాలిటిక్స్ లో ఉందన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక తన ఆస్తులు తగ్గాయి తప్ప పెరగలేదు అన్నారు. కల్వకుంట్ల కుటుంబం వచ్చిన తర్వాతనే వారి అహంకార మాటలతో రాష్ట్రం లో వెలమ జాతీ గౌరవం తగ్గిందన్నారు. చొక్కారావు, చెన్నమనేని విద్యాసాగర్ రావు వంటి నాయకులు హుందాగా రాజకీయం చేశారని అన్నారు.

Next Story