- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పసుపు రైతు ఐక్యవేదిక మహా ధర్నా...ఎక్కడంటే..?
ప్రభుత్వాలు మారిన నాయకులు మారిన రైతుల పరిస్థితి మాత్రం మారలేదని జగిత్యాల జిల్లా అఖిలపక్ష రైతు సంఘ నాయకులు మంగళవారం ధర్నా కు దిగారు.

దిశ, కోరుట్ల/ మెట్ పల్లి:
ప్రభుత్వాలు మారిన నాయకులు మారిన రైతుల పరిస్థితి మాత్రం మారలేదని జగిత్యాల జిల్లా అఖిలపక్ష రైతు సంఘ నాయకులు మంగళవారం ధర్నా కు దిగారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుండి శాస్త్రి చౌరస్తా వద్దకు ర్యాలీగా వచ్చి ధర్నాకు దిగి 2నిముషాలు మౌనం పాటించి నిరసన తెలిపారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో ప్రధాన పంట అయినా పసుపు ధరకు మద్దతు ధర ప్రకటించాలని కోరుతున్నామన్నారు. పసుపు బోర్డు వచ్చిందని సంతోష పడాలో.. రైతుకు మద్దతు ధర లేదని బాధపడాలో..అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ఎన్నడూ లేని విధంగా పసుపు కేవలం 5000 వేల ధర ఉండడం బాధాకరమని అన్నారు. రైతుల బతుకు మారాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పసుపు మద్దతు ధర ప్రకటించాలని,మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకోని పదవులు పొద్ది గద్దెనెక్కటమే తప్ప రైతులకు ఒరిగింది ఏమిలేదని పేర్కొన్నారు. రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు పసుపుకు కనీస మద్దతు ధర 15 వేల రూపాయలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే మార్కెట్ ఇంటర్వేషన్ స్కీమ్ లో పసుపును కలుపాలని అన్నారు.ఈ మహాధర్నా కార్యక్రమంలో జగిత్యాల జిల్లాలోని రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






