శభాష్ చిన్నోడా.. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన పక్షి.. బాలుడి చర్యకు ప్రశంస..!

by Bhanu |

ఎల్లారెడ్దిపేట-గొల్లపల్లి మధ్య రోడ్డు ప్రమాదంలో ఓ పిచ్చుక బైక్ కింద పడి చనిపోయింది.

శభాష్ చిన్నోడా.. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన పక్షి.. బాలుడి చర్యకు ప్రశంస..!
X

దిశ, ఎల్లారెడ్దిపేట: ఎల్లారెడ్దిపేట-గొల్లపల్లి మధ్య రోడ్డు ప్రమాదంలో ఓ పిచ్చుక బైక్ కింద పడి చనిపోయింది. ఆ పక్షి శవం చీమలు తిని దేహాన్ని చెడగొడతుందనే ఆలోచనతో గంగిరెద్దుల కొండాపూర్‌కి చెందిన 11 ఏళ్ళ గంట కుమార్ అనే చిన్న పిల్లవాడు అక్కడి నేలలో చిన్న గుంట తవ్వి పక్షిని ఖననం చేసాడు. ఖననం చేసేముందు పక్షి శవంపై ఉప్పు పోసి, దానిని పూడ్చి, తర్వాత బంతిపూలు చల్లాడు. ఈ చర్యతో గంట కుమార్ మనుషులలో మానవత్వం ఇంకా నిలుస్తుందని అందరికి చూపించాడు. ఈ మంచి చర్యకు అందరూ ప్రశంసలు చెబుతున్నారు.

Next Story