హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయని ఎక్స్ రే..

by Elthuri vijay kumar |

హుజురాబాద్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్‌రే సేవలు నిలిచిపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. గత మూడు రోజులుగా ఎక్స్‌ రే యంత్రం పనిచేయకపోవడంతో రోగులు, ముఖ్యంగా పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయని ఎక్స్ రే..
X

హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయని ఎక్స్ రే..

-ఇబ్బంది పడుతున్న రోగులు..

దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్‌రే సేవలు నిలిచిపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. గత మూడు రోజులుగా ఎక్స్‌ రే యంత్రం పనిచేయకపోవడంతో రోగులు, ముఖ్యంగా పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదలు తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు చేయించుకోవచ్చని ఆశిస్తారు. కానీ, ఎక్స్‌రే సేవలు నిలిచిపోవడంతో వారు బయట ప్రైవేట్ క్లినిక్‌లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆర్థికంగా భారం పడుతోంది. డబ్బులు లేనివారు నిరాశతో వెనుతిరిగి వెళ్తున్నారు. ఈ సమస్యపై ఆసుపత్రి సూపరింటెండెంట్ నారాయణరెడ్డి స్పందించారు. ఎక్స్‌ రే యంత్రంలో సాంకేతిక సమస్య (టెక్నికల్ ప్రాబ్లం) తలెత్తిందని, దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించామని తెలిపారు. సమస్యను పరిష్కరించడానికి హైదరాబాద్, మద్రాసు నుంచి సాంకేతిక నిపుణులు రావాల్సి ఉన్నందున ఆలస్యం జరుగుతోందని ఆయన వివరించారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించి, పేదలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story