Karimnagar:‘వామ్మో.. ఇదేం జనం’.. జనసంద్రాన్ని తలపిస్తున్న కరీంనగర్ బస్టాండ్

by Jakkula.Mamatha |

తెలంగాణలో సంక్రాంతి పండుగ వాతావరణం(Sankranti festival) నెలకొంది.

Karimnagar:‘వామ్మో.. ఇదేం జనం’.. జనసంద్రాన్ని తలపిస్తున్న కరీంనగర్ బస్టాండ్
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో సంక్రాంతి పండుగ వాతావరణం(Sankranti festival) నెలకొంది. ఈ క్రమంలో పండుగకు కుటుంబంతో, ఊరి ప్రజలతో సంతోషంగా గడపడానికి నగర వాసులంతా పల్లె బాట పట్టారు. ఈ నేపథ్యంలో సొంతూళ్లకు పయనమవుతున్న వారితో కరీంనగర్ బస్టాండ్ (Karimnagar Bus Stand) జనసంద్రాన్ని తలపిస్తోంది. ‘ఎటు చూసినా జనమే.. ఎవరి నోట విన్నా వామ్మో ఇదేం జనం’ అనే మాట వినిపిస్తోంది. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఏ ప్లాట్‌ఫాం చూసినా రద్దీనే. డిపోల నుంచి బస్సులు రావడమే ఆలస్యం. వెంటనే ప్రయాణికులు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది వారిని అడ్డుకోలేక అష్టకష్టాలు పడ్డారు. ఇక బస్టాండ్(Bus Stand) చౌరస్తా ఎదుట బస్సులు, కార్లు ఇతర వాహనాలతో ట్రాఫిక్ జామ్ అయింది. డిప్యూటీ ఆర్‌ఎం భూపతి రెడ్డి(Deputy RM Bhupathi Reddy) బస్టాండ్‌లో మకాం వేసి పరిస్థితిని పర్యవేక్షించారు. ట్రాఫిక్ పోలీసులు ఆర్టీసీ సిబ్బంది అదుపు చేయడానికి ప్రయత్నించారు. ట్రాఫిక్ తగ్గడం కష్టమే అని భావించి కొందరు ప్రైవేటు వాహనాలను మాట్లాడుకొని వెళ్లారు. ఇదే అదునుగా భావించిన వాహనదారులు అధిక ఛార్జీలు వసూలు చేశారు. కొందరు జేబీఎస్-కరీంనగర్ రూ.500-800 వరకు వసూలు చేసినట్లు సమాచారం.

Next Story