బిర్యానీలో పురుగులు ప్రత్యక్షం.. ఓనర్ సమాధానం వింటే షాక్ అవ్వాల్సిందే!

by Naveena |   (  Updated:2025-03-08 06:03:22  IST  )

బిర్యానీలో పురుగులు ప్రత్యక్షం.. ఓనర్ సమాధానం వింటే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ, కోరుట్ల టౌన్: బిర్యానీ అంటే చాల మందికి ఎంతో ప్రీతికరమైన వంటకం. ముఖ్యంగా చికెన్, మటన్, ఫిష్ రక రకాల బిర్యానీలను హోటల్స్ ,రెస్టారెంట్లకు వెళ్లి లాగిస్తుంటారు. కానీ బిర్యానీ తిందామని కోరుట్ల పట్టణంలోని ఓ రెస్టారెంట్ కు వెళ్లిన వినియోగదారులు కంగుతిన్న సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. బిర్యానీ తింటున్న సమయంలో బొద్దింకను పోలిన పురుగు ప్రత్యక్షం అయ్యింది. దీంతో కంగుతిన్న వినియోగదారులు హోటల్ నిర్వాహకులను ప్రశ్నించారు. అయితే బై మిస్టేక్ లో జరిగిందని హోటల్ నిర్వాహకులు సమాధానం ఇచ్చారు. ప్రజారోగ్యం దృష్టిలో ఉంచి సంబధిత ఫుడ్ సేఫ్టీ అధికారులు, శానిటేషన్ అధికారులు తనిఖీలు చేయకపోవడమే కారణమని వినియోగదారులు వాపోతున్నారు.

Next Story