మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి : మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్

by Nallavelli.Anjaneyulu |

వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి పాటు పడతామని మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ అన్నారు. బుధ వారం రోజున వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో పాలక వర్గం సాధారణ సమావేశం నిర్వహించారు.

మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి : మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్
X

దిశ,పెగడపల్లి : వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి పాటు పడతామని మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ అన్నారు. బుధ వారం రోజున వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో పాలక వర్గం సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవతో మార్కెట్ యార్డ్ లో షెడ్ నిర్మాణం తో పాటుగా వే బ్రిడ్జ్ నిర్మాణానికి తీర్మానం చేశారు. అనంతరం రానున్న యాసంగి పంట కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందుస్తు చర్యలు తీసుకోవాలని రైతుల సమస్యల పరిష్కారం కి అధికారులు, పాలక వర్గం సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి వరలక్ష్మి, గ్రామ సర్పంచ్ ఓరుగలి అరుణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, చాట్ల విజయ్ భాస్కర్, చెట్ల కిషన్, బాలుసాని శ్రీనివాస్, మన్నె గంగ రాజం, మ్యాకల మల్లయ్య, అంజి నాయక్, లింగంపల్లి మహేష్, శ్రీరామ్ అంజయ్య, శ్రీకాంత్ రెడ్డి, తిరుపతి, తౌటు లావణ్య పాల్గొన్నారు.

Next Story