- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న నిర్భయంగా ఫిర్యాదు చేయాలి..
మహిళల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో మహిళలు పని చేసే ప్రదేశాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

దిశ, గంభీరావుపేట: జిల్లాలో మహిళల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో మహిళలు పని చేసే ప్రదేశాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నివారణ, పని ప్రదేశాల్లో భద్రతా చర్యలు, మహిళలకు సంబంధించిన చట్టాలు, వారి హక్కులపై సమగ్ర అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ముచ్చర్ల, లింగన్నపేట గ్రామాల్లో ఉపాధి హామీ పనులకు హాజరయ్యే మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు ఎలాంటి వేధింపులకు గురైనా నిర్భయంగా జిల్లా షీ టీమ్ హెల్ప్‌లైన్ నంబర్ 87126 56425కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు అందిన వెంటనే నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని షీ టీమ్ అధికారులు తెలిపారు. అలాగే సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో సంభాషణలు చేయకుండా జాగ్రత్త వహించాలని, వ్యక్తిగత సమాచారం, ఫొటోలు లేదా ఇతర వివరాలను గుర్తు తెలియని వ్యక్తులతో పంచుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఏఎస్‌ఐలు ప్రమీల, రవి, సిబ్బంది శ్రీనివాస్, ప్రియాంక, శ్రీలత పాల్గొన్నారు.






