- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రవల్లి స్వర్ణ తొలిసారిగా కరీంనగర్ జిల్లాకు విచ్చేసిన సందర్భంగా కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి అధ్యక్షతన ఇందిరా గార్డెన్ లో ఏర్పాటు మహిళా కాంగ్రెస్ సమీక్ష సమావేశానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజా పాలనలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని.. గొప్ప ఆలోచనలు చేయాలని సూచించారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గంలో 7 మండలాల్లో ఒక్కొక్క మండలంలో 1000 మంది మహిళలతో ప్రత్యేకంగా ఎన్నికల ప్రచారం సమావేశాలు నిర్వహించి.. ఈరోజు ఈ స్థానంలో కూర్చొబెట్టారని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ దేశవ్యాప్తంగా మహిళలు రాజకీయాల్లో రాణించాలని ఉన్నతమైన పదవులు అలంకరించాలని, దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి చట్టసభల ద్వారా వారికి అవకాశం కల్పించాలని ఎన్నో ఆలోచనలు చేస్తున్నారన్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ప్రపంచ వ్యాప్తంగా గొప్ప మహిళా నేతగా నేటికీ కీర్తించబడుతుదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మన రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయాలని ఆలోచనతో పెట్రోల్ బంక్ యజమానులను, ఆర్టీసీ బస్సు యజమానులను చేశారన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు యజమానురాలుగా వారి అకౌంట్లో రూ.5లక్షలు జమ చేసి మహిళలకు ప్రాధాన్యం ఇచ్చింది అన్నారు. మా ప్రభుత్వం, ఏ సంక్షేమ పథకం ప్రారంభించిన మహిళా సోదరీమణుల పేరుతో ఉండాలని గొప్ప ఆలోచన చేసింది మా ప్రభుత్వం అని గుర్తు చేశారు.
రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే సంకల్పం తీసుకుందని.. మా ప్రజా పాలన ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని పేద మధ్యతరగతి ఆడపిల్లలు గొప్పగా చదువుకోవాలని ఆలోచనతో ట్రైబల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్ ఇంటిగ్రేటేడ్ స్కూల్స్ సీఎం రేవంత్ రెడ్డి స్థాపించారన్నారు. మహిళలందరి ఆశీర్వాదంతో నేడు రాష్ట్రంలో ప్రభుత్వం కొనసాగుతుందని.. పార్టీ కోసం శ్రమించిన మహిళలకు చట్ట సభల్లో అవకాశం తప్పక వస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి నేను మాట ఇస్తున్నాన్నా రు. మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ నేను కష్టకాలంలో పార్టీ కోసం శ్రమించిన మహిళ కార్యకర్తల జాబితాను సిద్ధం చేసి అది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు అందజేసి వారందరికీ నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇవ్వాలని కోరుతానన్నారు. రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పక్షాన గొప్పగా పనిచేసే విధంగా అన్ని జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది అని అన్నారు.
పీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ.. నిరంకుశత్వ పాలన నుంచి మనకు విముక్తి కలిగి రెండున్నర సంవత్సరాలు అవుతుందన్నారు. పదేళ్లు పడ్డ కష్టనష్టాలు మనందరికీ తెలుసు, ఆ నియంత పాలను చరమగీతం పాడడానికి మనమంతా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఈ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తూ రేవంత్ రెడ్డి అనే సంక్షేమ పథకాలను మన ముందుకు తెస్తున్నారు. ఒక మంచి మనసుతో కొత్త రేషన్ కార్డులు అందజేయడంతో పాటు పేద ప్రజలందరికీ సన్నబయ్యం అందించాలని సీఎం చేసిన ఆలోచన ఎంతో మంది కడుపు నింపుతుంది. గత ముఖ్యమంత్రికి ఈ ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పేదవారి కష్టం తెలుసు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డికి ఇలాంటి ఆలోచనలు వచ్చాయని తెలిపారు. ప్రతి మహిళా కార్యకర్త క్షేత్ర స్థాయిలో వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, సోషల్ మీడియాలో కాంగ్రెస్ బలహీనంగా ఉందని.. గాంధీని చంపిన గాడ్సే గొప్పవాడంటే ఎవ్వరు స్పందించడం లేదన్నారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవ్వరు పోస్ట్ చేసిన దానిని ఖండించాల్సిన బాధ్యత ప్రతి మహిళా కాంగ్రెస్ కార్యకర్తకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, మహిళా మున్సిపల్ చైర్ పర్సన్లు, మార్కెట్ కమిటీ మహిళా చైర్ పర్సన్లు, మహిళా సర్పంచులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మహిళా కాంగ్రెస్ ముఖ్య నేతలు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.






