- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెత్త పేరుతో చోరీలకు తెగబడుతున్న మహిళలు
గ్రామాల్లో చెత్త ,ఖాళీ బీరు సీసాలు, ప్లాస్టిక్ వ్యర్ధాలను ఏరుకునేందుకు వచ్చే కొంత మంది మహిళలు చోరీలకు తెగబడుతున్నట్లు ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు.

X
చెత్త పేరుతో చోరీలకు తెగబడుతున్న మహిళలు
తాళం వేసి ఉన్న ఇండ్లే లక్ష్యంగా దోపిడీ
అనుమానితులు కనిపిస్తే 100కు సమాచారం ఇవ్వండి
శంకరపట్నం ఎస్ఐ శేఖర్ రెడ్డి
దిశ, శంకరపట్నం : గ్రామాల్లో చెత్త ,ఖాళీ బీరు సీసాలు, ప్లాస్టిక్ వ్యర్ధాలను ఏరుకునేందుకు వచ్చే కొంత మంది మహిళలు చోరీలకు తెగబడుతున్నట్లు ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చేతిలో సంచులు పట్టుకొని తిరుగుతూ చెత్త ఏరుకుంటున్నామని ప్రజలను నమ్మిస్తూ తాళం వేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్న హుజురాబాద్ కు చెందిన తూర్పాటి రేణుక, తూర్పాటి సమ్మక్కలను పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరించిన అనుమానితులు కనిపించిన వెంటనే డయల్ 100కు ఫోన్ చేయడంతో పాటు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
Next Story






