- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శంకరపట్నం మండలంలో గడ్డి మందు తాగి మహిళ మృతి
by Bhanu |
శంకరపట్నం మండలంలోని ఇప్పలపల్లి గ్రామంలో ఓ మహిళ అనారోగ్యాన్ని తట్టుకోలేక జీవితం ముగించుకుంది.

X
దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని ఇప్పలపల్లి గ్రామంలో ఓ మహిళ అనారోగ్యాన్ని తట్టుకోలేక జీవితం ముగించుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వెంగళ పోచమ్మ (42) బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
బాధ తాళలేక మనస్తాపానికి గురై ఈ దారుణానికి ఒడిగట్టిందని చెప్పారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. ఈ మేరకు మృతురాలి భర్త వెంగళ సారయ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






