పిల్లలు పుట్టడం లేదని వివాహిత ఆత్మహత్య

by Bhanu |

సంతానం కావడంలేదని పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆకునూర్ గ్రామంలో చోటు చేసుకుంది.

పిల్లలు పుట్టడం లేదని వివాహిత ఆత్మహత్య
X

దిశ, సైదాపూర్ : సంతానం కావడంలేదని పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆకునూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కోడిపెల్లి లక్ష్మీ-కిషన్ దంపతుల కుమార్తె తేజశ్రీ (26) 2020 డిసెంబర్ 19న ఆకునూర్ గ్రామానికి చెందిన జెల్లా సతీష్ కు ఇచ్చి వివాహం చేశారు.


అయితే.. వివాహం జరిగి ఐదు సంవత్సరాలు అయినా సంతానం కావడం లేదనే మనస్తాపంతో ఈనెల 13న పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమె ను జమ్మికుంట లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమిందని తెలపడంతో.. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేస్తుండగా ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలు తల్లి కోడిపెల్లి లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సైదాపూర్ ఎస్సై సిహెచ్.తిరుపతి తెలిపారు.

Next Story