శభాష్ : వృద్ధురాలిని మోసుకెళ్లి ప్రాణాలను కాపాడిన మహిళా కానిస్టేబుల్

by Bhanu |

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన ఒక వృద్ధురాలు అకస్మాత్తుగా అస్వస్థతకు గురైంది.

శభాష్ : వృద్ధురాలిని మోసుకెళ్లి ప్రాణాలను కాపాడిన మహిళా కానిస్టేబుల్
X

దిశ, కొండగట్టు: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన ఒక వృద్ధురాలు అకస్మాత్తుగా అస్వస్థతకు గురైంది. ఈ పరిస్థితిని గమనించిన విధి నిర్వహణలో ఉన్న మహిళ కానిస్టేబుల్ స్వరూప, వెంటనే స్పందించి వృద్ధురాలిని సుమారు వంద మీటర్ల దూరం మోసుకుని వెళ్లి 108 అంబులెన్సులో చేర్చి, ఆసుపత్రికి తరలించారు. ఆమె సేవా మనోభావం అక్కడి భక్తుల ప్రశంసలు పొందింది.


Next Story