రెండు బైకులు ఢీ.. మహిళా మృతి

by Bhanu |

ఎల్లారెడ్దిపేట మండలం రాజన్నపేట గ్రామానికి చెందిన ఓ మహిళ తన పుట్టింటికి బిడ్డలతో వెళ్ళింది.

రెండు బైకులు ఢీ.. మహిళా మృతి
X

దిశ, ఎల్లారెడ్దిపేట: ఎల్లారెడ్దిపేట మండలం రాజన్నపేట గ్రామానికి చెందిన ఓ మహిళ తన పుట్టింటికి బిడ్డలతో వెళ్ళింది. మాచారెడ్డి లో దిగగా తన తండ్రి ఎక్సెల్ బండిపై వచ్చి తనను స్వగ్రామమైన లచ్చ పేటకు తీసుకెళ్తుండగా కార్నర్ వద్ద అపాచీ బైకు ఎదురుగా వచ్చి ఢీ కొట్టడం తో కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు, భర్త గల్ఫ్ లో ఉంటున్నాడు. సమాచారం తెలుసుకున్న మాజీ ఎంపీటీసీ నమిలికొండ శ్రీనివాస్ వెంటనే ఘటన స్థలానికి వెళ్లారు. కాగా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Next Story