- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిష్ కేబుల్ కి విద్యుత్ సరఫరా విద్యుత్ షాక్ తగిలి మహిళ మృతి
జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారాం గ్రామానికి చెందిన శీలం, మానస బుధవారం, డిష్ వైర్ లో విద్యుత్ సరఫరై షాక్ తగిలి మృతి చెందింది.

దిశ, జగిత్యాల, రూరల్: జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారాం గ్రామానికి చెందిన శీలం, మానస బుధవారం, డిష్ వైర్ లో విద్యుత్ సరఫరై షాక్ తగిలి మృతి చెందింది. కుటుంబ సభ్యులు తేలిపిన వివరాల, ప్రకారం,రాజరాం గ్రామంలోని తన ఇంట్లో శీలం మానస, దండం పై బట్టలు అరెసే క్రమంలో డిష్, అంప్లీ ప్లేయర్ కు ఉన్న, జె. వైర్ ను డిష్ వైర్ కు కట్టడం వల్ల వార్షనికి తడిసిన వైర్ ద్వారా విద్యుత్ ప్రవహించడం తో, శీలం.మానస అక్కడికక్కడే మృతి చెందింది. అయితే డిష్, అంప్లీ ప్లేయర్ జాగ్రత్తగా అమర్చకపోవడం తోనే తన భార్య మరణించిందని భర్త, సంతోష్,గ్రామస్తులు జగిత్యాల లోని డిష్ యజమాని ఇంటి ఎదుట మృతదేహం తో ఆందోళనకు దిగారు. దీంతో జగిత్యాల -కరీంనగర్ రహదారి పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో పట్టణ పోలీస్ లు ఎస్సై, కిరణ్ ట్రాఫిక్ ఎస్సై, మలేష్,ఘటన స్థలికి చేరుకొని, మానస మృతికి కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలపడంతో ఆందోళన విరమింప చేసి అక్కడ నుండి వెళ్లిపోయారు. కాగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడం తో ట్రాఫిక్ ను క్లియర్ చేశారు ఎస్ఐ మల్లేష్.






