- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్తలకు బదులు భార్యలు పోటీ..
రిజర్వేషన్లు కలిసిరాక పతుల స్థానంలో సతులు బరిలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దిశ, కొత్తపల్లి: రిజర్వేషన్లు కలిసిరాక పతుల స్థానంలో సతులు బరిలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పక్కవార్డులో పోటీ చేస్తే పార్టీలో అంతర్గత వ్యతిరేకత పెరుగుతుందనే సందేహం ఆశావహుల్లో కనిపిస్తోంది. ప్రజాదరణ ఉన్న నాయకులకు పార్టీల టికెట్లు ఇవ్వాలన్న ఆలోచన కొనసాగుతోంది.. ప్రధాన పార్టీలు ఇంటెలిజెన్స్ సర్వేలతో విజేతలను అంచనా వేసేందుకు ప్రయత్నాలుచేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతుండగా రిజర్వేషన్ల మార్పులు ఆశావహుల రాజకీయ లెక్కలను తారుమారు చేశాయి. కొందరు నాయకులు తమ సొంత వార్డులో పోటీ చేయాలని భావించినా, రిజర్వేషన్ల మార్పుల కారణంగా ఓటు వేయాల్సిన వార్డే మారిపోవడం వారు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యగా మారింది. ఫలితంగా తమకే ఓటు వేయలేని పరిస్థితి ఏర్పడడంతో ఆశావహుల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.
గెలుపు గుర్రాల కోసం ఇంటెలిజెన్స్ సర్వే..
రాజకీయంగా బలమైన పక్కవార్డుల్లో పోటీకి దిగితే సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉందనే భావన ఆశావహులను మరింత సందిగ్ధంలోకి నెడుతోంది. మరోవైపు మహిళా రిజర్వేషన్లు పెరగడంతో అనేక మంది నాయకులు తమ స్థానంలో భార్యలను బరిలోకి దించే ప్రయత్నాలు ప్రారంభించారు. కొన్ని వార్డుల్లో వ్యూహరచనలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు అంతర్గతంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశాయి. పార్టీల అధిష్టానాలు ఆశావహుల పేర్లను సేకరించడమే కాకుండా, సైలెంట్ గా గెలిచే అవకాశాలపైకూడా సొంతంగా ఇంటెలిజెన్స్ సర్వేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా, ఫిబ్రవరి 12న పోలింగ్ జరుగుతుందన్న అంచనాలతో పార్టీలు ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసే దిశగా కదులుతున్నాయి.
వార్డుల వారీగా స్వతంత్రులపై గురి..
పార్టీలకతీతంగా ఆయా వార్డుల్లో ప్రజాదరణ ఉన్న స్వతంత్రులను కూడా పరిగణనలోకి తీసుకుంటూ టికెట్లు ఇవ్వాలన్న ఆలోచన కొన్ని పార్టీల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్ లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ ,బీజేపీ లు వ్యూహరచన చేస్తున్నాయి. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్ల మార్పులు స్థానిక రాజకీయాలను కుదిపేసిన ఈ నేపథ్యంలో, పార్టీల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, స్వతంత్రుల ప్రభావం ఇవన్నీ కలిసి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మార్చనున్నాయి.






