అప్పు తీర్చమంటే దాడికి దిగుతారా..?

by Ratna Kumari |

రియల్ ఎస్టేట్, బంగారం స్కీంల పేరుతో అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు బాధితురాలిపైన దాడికి పాల్పడిన ఘటన పెద్దపల్లిలో చోటు చేసుకుంది.

అప్పు తీర్చమంటే దాడికి దిగుతారా..?
X

దిశ,పెద్దపల్లి : రియల్ ఎస్టేట్, బంగారం స్కీంల పేరుతో అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు బాధితురాలిపైన దాడికి పాల్పడిన ఘటన పెద్దపల్లిలో చోటు చేసుకుంది. తనకు రావలసిన డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు ఆదివారం నిందితుల ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి శాంతినగర్‌కు చెందిన భార్యాభర్తలు తోడేటి సంధ్య, బాపు.. రెండేళ్ల క్రితం స్థానికంగా ఉండే ఒద్దం స్వరూప వద్ద అవసరాల నిమిత్తం రూ. 43 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అందులో ఇప్పటివరకు రూ. 20 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించారు. మిగతా డబ్బులు అడిగితే అసభ్య పదజాలంతో దూషిస్తూ తనపై దాడికి పాల్పడుతున్నారని బాధితురాలు ఆరోపించింది. రియల్ ఎస్టేట్, బంగారం స్కీంల పేరుతో తనను నిలువునా మోసగించారని ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఆదివారం అప్పు తీసుకున్న వారి ఇంటి ఎదుట స్వరూప బైఠాయించి ధర్నా చేపట్టింది. అనంతరం తనకు న్యాయం చేసి, తన కష్టార్జితాన్ని తనకు ఇప్పించాలని కోరుతూ ఆమె పెద్దపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Next Story