- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమీకృత మార్కెట్ నిర్మాణం ఈ ప్రభుత్వంలోనైనా నిర్మాణం జరుగుతుందా..?
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో రోజు వారి కూర గాయల సంతలో క్రయ, విక్రయదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో రోజు వారి కూర గాయల సంతలో క్రయ, విక్రయదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంభీరావుపేట, నర్మాల, దేశాయిపేట, ముస్తఫానగర్, పాన్నాలపల్లె, జిల్లెల్లపల్లె, దమ్మన్నపేట, నాగంపేట, లింగన్నపేట తదితర గ్రామాల నుంచి ప్రజలు కూరగాయలు, ఇతర నిత్యావసరాల కోసం నిత్యం ఇక్కడి మార్కెట్ కి వస్తుంటారు. ఏళ్లుగా మార్కెట్ కి మహర్దశ రావడం లేదు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ.. కూరగాయలు విక్రయిస్తున్నారు. ప్రత్యేక మార్కెట్ యార్డు లేకపోవడంతో రోడ్డుపైనే మార్కెట్ కొనసాగుతోంది. దీంతో ఉదయం పూట ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. విక్రయదారులు తాత్కాలిక నీడ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇటు కొనుగోలు దారులు, అటు విక్రయదారులు
ఎండ వేడికి ఇటు కొనుగోలు దారులు, అటు విక్రయదారులు తల్లడిల్లుతున్నారు. మార్కెట్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. దూరప్రాంతాల నుంచి వచ్చేవారు. తాగునీరు లేక దాహంతో తల్లడిల్లుతున్నారు. ఏటా రూ. లక్షల్లో తైబజార్ ద్వారా గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరుతున్నా మార్కెట్ అభివృద్ధికి కేటాయించడం లేదు. మార్కెట్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు సరిగ్గా తాగునీరు లేక దాహంతో తల్లడిల్లుతున్నారు. ఏట రు లక్షలులో తై బజార్ ద్వారా గ్రామపంచాయతీకి ఆదాయం సమకూర్తున్న మార్కెట్ అభివృద్ధికి కేటాయించడం లేదు. మార్కెట్లో ప్రత్యేక టాయిలెట్స్ ఉన్న అందులో దుర్వాసనతో నానా ఇబ్బందులు పడుతున్నారు. రోజూ ఉదయం తనుంది. 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మార్కెట్ కొనసాగు తోంది కూరగాయలతో పాటు నిత్యావసర వస్తువు. లు, సీజన్లో లబించే పండ్లు వంటివి మార్కెట్లో లభ్యమవుతుంటాయి. దీంతో నిత్యం వందలాది . మంది మార్కెట్ కి వస్తుంటారు.
పాతది కూల్చి.. కొత్తది మరిచారు
రూ. లక్షలాది రూపాయలతో కొత్తగా సమీకృత మార్కెట్ యార్డు నిర్మిస్తామని గత గ్రామపంచాయతీ పాలకవర్గం గతంలో నిర్మించిన షెర్లు, పాత గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని కూల్చేశారు. జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపికైన సందర్భంగా వచ్చిన నగదు ప్రోత్సాహంతో ఆధునిక హంగులతో సమీకృత మార్కెట్ నిర్మిస్తామని, ఆ ప్పటి మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ సమీకృత మార్కెట్ కోసం భూమిపూజ చేశారు. అంతలో ఎన్నికలు రావ రంతో పాటు ప్రభుత్వం కూడా మారింది. గ్రామ పంచాయతీ పాలకవర్గ పదవీకాలం ముగిసింది. కానీ మార్కెట్ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. ఈ ప్రభుత్వంలోనైనా ఉన్న పాలక వర్గం స్పందించి మార్కెట్ యార్డ్ నిర్మించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
సౌకర్యాలు కల్పించాలి : కోడే రమేష్ గంభీరావుపేట
రోజువారి మార్కెట్ కు చుట్టుపక్క గ్రామాల నుంచి ప్రజలు తరచూ వస్తుంటారు. ఇక్కడ కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విక్రయదారుల కు నిలువ నీడ లేక అవస్థలు పడుతున్నారు అధికారులు స్పందించి స్వచ్ఛమైన వాటర్ మరుగుదొడ్ల ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.






