భర్త హత్య కేసులో భార్యతో పాటు ఇద్దరుకి జీవిత ఖైదు

by Bhanu |

భర్త హత్యకు కారణమైన కేసులో భార్యతో పాటుగా మరో ఇద్దరు నిందుతులకు జీవిత ఖైదుతో పాటు ఒక్కక్కరికి రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ శుక్రవారం తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి.గీతే తెలిపారు.

భర్త హత్య కేసులో భార్యతో పాటు ఇద్దరుకి జీవిత ఖైదు
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : భర్త హత్యకు కారణమైన కేసులో భార్యతో పాటుగా మరో ఇద్దరు నిందుతులకు జీవిత ఖైదుతో పాటు ఒక్కక్కరికి రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ శుక్రవారం తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి.గీతే తెలిపారు. జిల్లాలోని ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాకు చెందిన దరంసోత్ శంకర్ నాయక్ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు మొదటి భార్య దరంసోత్ సరోజకు పిల్లలు పుట్టడం లేదని రాజవ్వ అనే మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు.


వీరికి ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు జన్మించారు. అప్పటినుండి తనకున్న ఆస్తిని రెండవ భార్య, వారి పిల్లలకు ఇస్తాడని సరోజ వారిపై పగ పెంచుకొని గొడవలు పడుతూ ఉండేది. తన భర్త శంకర్ నాయక్ ను 28 నవంబర్ 2020న పథకం ప్రకారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సరోజ, ఆమె తమ్ముడు బానోతు శ్రీనివాస్, చెల్లెలు తేజావత్ లక్ష్మిల సహాయంతో శంకర్ కు మద్యం తాగించి రోకలిబండతో కొట్టి హతమార్చారు. రెండో భార్య రాజవ్వ ఫిర్యాదు మేరకు అప్పటి సిరిసిల్ల రూరల్ సిఐ సర్వర్ కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించగా, సిఐ ఉపేందర్ కేసు దర్యాప్తు చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు.

కోర్టు మానిటరింగ్ ఎస్సై రవీంద్ర నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ దేవేందర్, రాజేందర్,సిఎం ఎస్ కానిస్టేబుల్ నవీన్ లు కోర్టులో 15 మంది సాక్షులను ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ వాదించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదీతో పాటు ఒక్కొక్కరికి 2000 రూపాయల జరిమానా జిల్లా ఎస్పీ తెలిపారు. కేసులో నిందితులకి శిక్ష పడటంలో కృషి చేసిన అప్పటి విచారణ అధికారులు సర్వర్, ఉపేందర్, ప్రస్తుత సిఐ మొగిలి, ఎస్ఐ గణేష్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్, కోర్టు మానిటరింగ్ ఎస్సై రవీంద్ర నాయుడు, కోర్టు కానిస్టేబుల్ దేవేందర్, రాజేందర్,సి ఎం ఎస్ కానిస్టేబుల్ నవీన్ లను జిల్లా ఆయన అభినందించారు.

Next Story