- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పదేళ్లలో మేము చేసింది చెప్తాం...
గత పదేళ్ళలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీ నరసింహ రావు కాంగ్రెస్ నాయకులకు సవాలు విసిరారు

దిశ, వేములవాడ : గత పదేళ్ళలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీ నరసింహ రావు కాంగ్రెస్ నాయకులకు సవాలు విసిరారు. గత 15 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృధి పనులను తెలపాలని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సాయంతో నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, వాటి ప్రస్తుత పరిస్థితిని క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 50 ఏండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ చరిత్రలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో జిల్లాలోని అప్పర్ మానేర్, మిడ్ మానేర్, లోయర్ మానేర్ లను పునరుద్ధరించి ఒక్క ప్రాజెక్టు కింద లక్ష ఎకరాల నీరు అందించేందుకు కృషి చేసినట్లు తెలిపారు.
జిల్లాలోని 40 కిలోమీటర్ల మానేర్, 27కిలో మీటర్ల మూలవాగులపై 24 చెక్ డ్యాంలు కట్టి కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినట్లు గుర్తు చేశారు. 2006లో ప్రారంభమైన మిడ్ మానేర్ ను కాంగ్రెస్ పార్టీ పెండింగ్ లో పెడితే కేసీఆర్ నాయకత్వంలో రూ. 1500కోట్ల పైచిలుకు నిధులతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి, సాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని అన్నారు. తమపై అసత్య ప్రచారాలు మానుకొని నియోజకవర్గంలోని ప్రధాన సాగునీటి రంగంలోని కలికోట సూరమ్మ చెరువు, మల్కపేట రిజర్వాయర్, అప్పర్ మానేర్ ల పెండింగ్ పనుల్ని పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధి చేయాలని, మిడ్ మానేర్ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లను కోరుతున్నట్లు తెలిపారు. చెప్పిన పనులన్నీ కాగితాలకే పరిమితం చేయకుండా పూర్తి చేసేలా శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. పనులన్నీ చేయకపోతే ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల్లోకి వెళ్లి వారిలో చైతన్యం తీసుకువచ్చి ప్రశ్నించేలా చేస్తామని హెచ్చరించారు.






