దివంగత శేఖర్ కుటుంబాన్ని ఆదుకుంటాం : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

by Nallavelli.Anjaneyulu |

పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయులు సంబోజి శేఖర్ మృతి చెందడం చాలా బాధాకరమని ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.

దివంగత శేఖర్ కుటుంబాన్ని ఆదుకుంటాం :  ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
X

దిశ, చొప్పదండి : పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయులు సంబోజి శేఖర్ మృతి చెందడం చాలా బాధాకరమని ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఈ మేరకు ఆదివారం నిర్వహించిన సంతాప సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. శేఖర్ మృతి పత్రికా రంగానికి, సమాజానికి తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొన్నారు. పార్టీ ప్రజా ప్రతినిధులు, శ్రేణుల సహకారంతో శేఖర్ కుటుంబానికి ఆర్థికంగా చేయూత అందిస్తామని భరోసా కల్పించారు. శేఖర్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండగట్టు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ వడ్లూరి సరిత_శ్రీనివాస్, వాయిస్ చైర్ పర్సన్ పెరుమండ్ల మానస _గంగయ్య కౌన్సిలర్లు కొట్టే అశోక్, కనుమల్ల రాజశేఖర్, వడ్లూరి అనూష_శ్యాంసుందర్, ఓలు గోత్తుల సురేష్, గుర్రం రాజేందర్ రెడ్డి, గుర్రం సుజిత్ రెడ్డి, పిట్టల వెంకటేష్, ముద్దం రాజేశ్వరి_తిరుపతి, నాయకులు పాల్గొన్నారు.

Next Story