- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలకు ఆటంకం కలిగించే ఏ పనిని అయినా అడ్డుకుంటాం : మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్
దిశ, జమ్మికుంటటౌన్ : ప్రజలకు అన్యాయం, ఆటంకం కలిగించే పనులను అడ్డుకుంటామని.. ప్రజలు ధైర్యంగా

దిశ, జమ్మికుంటటౌన్ : ప్రజలకు అన్యాయం, ఆటంకం కలిగించే పనులను అడ్డుకుంటామని.. ప్రజలు ధైర్యంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అన్నారు. మంగళవారం 13వ వార్డుకు చెందిన కొందరు కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటి పరిధిలోని ఆబాది జమ్మికుంటలో 10 ఫీట్లతో నిర్మించాల్సిన కాలువను కేవలం 4 ఫీట్లతో నిర్మిస్తున్నారని ఫిర్యాదు అందడంతో వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి కాలువను జేసీబీ సహాయంతో కూల్చివేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు అవసరమయ్యే కాలువను అధికారికంగా 10 ఫీట్లతో నిర్మించకుండా 4ఫీట్లతో కట్టడం సరికాదని, ఈ కాలువ నుంచి కెనాల్ నీళ్లు ప్రవహిస్తాయని అటువంటి వాటిని 10ఫీట్లతో నిర్మించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారులు శ్రీధర్, రాజ్ కుమార్ , దీపిక, శానిటరీ ఇన్స్పెక్టర్ సదానందం, వార్డు ఆఫీసర్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.






