- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం : రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం : రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
by Ratna Kumari |
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. మం

X
దిశ, గోదావరిఖని : అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. మంగళవారం గోదావరిఖని జవహర్ నగర్‌లోని 54వ డివిజన్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసి ఆయన మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చేందుకు కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ ఎండి ముస్తఫా పాల్గొన్నారు.
Next Story






