మూలవాగుకు పెరిగిన వరద ఉధృతి... వణికిపోతున్న వేములవాడ వాసులు

by velandi.Saikiran |

రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వేములవాడ పట్టణంలోని మూలవాగుకు వరద ఉధృతి పెరిగి జలకళ

మూలవాగుకు పెరిగిన వరద ఉధృతి... వణికిపోతున్న వేములవాడ వాసులు
X

దిశ, వేములవాడ టౌన్ : రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వేములవాడ పట్టణంలోని మూలవాగుకు వరద ఉధృతి పెరిగి జలకళ సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తోడు నిమ్మపల్లి రిజర్వాయర్ నిండు కుండలా మారి మత్తడి దూకడం, నక్క వాగులో వరద ఉధృతి పెరగడంతో వేములవాడలోని మూలవాగు నిండుకుండలా మారింది. మరికొద్ది సేపట్లో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం నెలకొంది.

అయితే మూలవాగుకు నీటి తాకిడి పెరగడంతో పట్టణంలోని బుడగ జంగాల కాలనీ, సవురాల కాలనీ వంటి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉండడంతో మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను సందర్శించి అత్యవసర సమయాల్లో అండగా ఉంటామని అక్కడి ప్రజలకు భరోసా కల్పించి, బాధితుల్లో ధైర్యం నింపారు. వరద ఉధృతి అధికమైతే నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామనీ, ప్రజలెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మున్సిపల్ కమిషనర్ అన్వేష్ స్పష్టం చేశారు.

Next Story