- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వార్డు అధికారులు భాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి : మేయర్ మహంకాళి స్వామి
వార్డు అధికారులు భాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి ఆదేశించారు.

దిశ, గోదావరిఖని : వార్డు అధికారులు భాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి ఆదేశించారు. బుధవారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో వార్డు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. డివిజన్ ప్రజలకు, నగర పాలక సంస్థకు మధ్య వార్డు అధికారులు వారధిగా పని చేయాలన్నారు. శానిటేషన్ నిర్వహణ, ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని అన్నారు. ఈ నెలతో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆస్తి పన్ను వసూళ్లు ఆశించినంతగా లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్చి లోపు వంద శాతం వసూలు చేయాలని ఆదేశించారు. వార్డు అధికారులతో రోజు వారీగా పన్ను వసూళ్ల పురోగతి ని సమీక్షించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే నీటి బిల్లులు, ట్రేడ్ లైసెన్స్ రుసుము లు కూడా లక్ష్యానికి అనుగుణంగా వసూలు చేయాలని ఆదేశించారు.నగర పాలక సంస్థ ఆదాయాన్ని పెంపొందించే దిశగా ప్రయత్నం చేయాలని అన్నారు.అలాగే కొత్త ఆదాయ మార్గాలు అన్వేషించాలని అన్నారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి.వి.రామన్, అసిస్టెంట్ మునిసిపల్ కమీషనర్ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ , జూనియర్ అసిస్టెంట్ సాగర్ పాల్గొన్నారు.






