- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుజురాబాద్ పాఠశాల మైదానంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పర్యటన
ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానాన్ని హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని ఆదివారం సందర్శించారు.

దిశ, హుజూరాబాద్ రూరల్ : ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానాన్ని హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని ఆదివారం సందర్శించారు. ఉదయం మైదానంలో వాకింగ్ చేస్తున్న పట్టణ ప్రజలతో ఆమె ముఖాముఖి మాట్లాడి, అక్కడ నెలకొన్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మైదానంలో ట్రాక్ సౌకర్యం పది లక్షల నిధులు మంజూరైనప్పటికి పనులు పూర్తికాలేదని,తాగునీరు, పారిశుధ్యం మెరుగుపరచాలని వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొమురవెల్లి హరిప్రసాద్ చైర్‌పర్సన్‌కు విన్నవించారు. వాకర్ల విన్నపాలపై సానుకూలంగా స్పందించిన సుహాసిని మైదానంలో మౌలిక వసతుల కల్పనకు త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పట్టణ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం మైదానాన్ని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తాళ్లపల్లి రమేష్, ఇల్లందుల సమ్మయ్య,భారతి, వాకర్స్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రమేష్, రాజేందర్ లు పాల్గొన్నారు.






