- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ వెంచర్‌లో అరాచకం.. చిన్న ఉద్యోగుల ప్లాట్లపై దౌర్జన్యం
అక్రమ వెంచర్ తో ఆర్థిక లాభాలను ఆర్జించిన శ్రీ లక్ష్మీ గాయత్రి ఫామ్ లాండ్ యాజమాన్యం కొంత మంది అధికారుల అండదండలతో

దిశ బ్యూరో, కరీంనగర్ : అక్రమ వెంచర్ తో ఆర్థిక లాభాలను ఆర్జించిన శ్రీ లక్ష్మీ గాయత్రి ఫామ్ లాండ్ యాజమాన్యం కొంత మంది అధికారుల అండదండలతో అడ్డగోలు ధరలకు ప్లాట్లను విక్రయించి కొనుగోలుదారులను ఆర్థిక దోపిడీకి గురిచేసింది. అందులో మొక్కలు నాటి లాభాలను అందిస్తామన్న ఫామ్ లాండ్ యాజమాన్యం అందులో అధికారులకు ప్లాట్లను అప్పగించి ప్లాట్లు కోనుగోలు చేసిన చిరు ఉద్యోగులపై అరాచకం సృష్టించడం ఇప్పుడు కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగిస్తుండగా అధికారుల అరాచకం పై ఫిర్యాదులు చేసినప్పటికి చర్యలు ఉండకపోవడం పట్ల ప్లాట్లు కొనుగోలు చేసిన తోటి ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు.
ప్లాటు భద్రమేనా?
శ్రీ లక్ష్మీ గాయత్రి ఫాం లాండ్ లో ప్లాటు కోనుగోలు చేస్తే లాభాలు వస్తాయంటూ ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తింతిన యాజమాన్యం తీర ప్లాట్లు కొనుగోలు చేసిన అమాయక ఉద్యోగులకు మొండిచేయి చూపడంతో పాటు ప్లాటు భద్రమేనా? అనే సందేహలు వ్యక్తం అయ్యే పరిస్థితిని సృష్టిస్తుంది. అక్రమంగా వెంచర్ వెలిసేందుకు సహకరించిన అప్పటి అధికారులకు ప్లాట్లను అప్పగించిన యాజమాన్యం ఇప్పుడు వారు దౌర్జన్యం చేస్తున్నా పట్టించుకోక పోగా పరిష్కరిస్తామంటూ ఉచిత సలహాలతో కాలం వెల్లదీయడం ఉద్యోగుల్లో ఆగ్రహానికి కారణమవుతుంది
ప్రహరీ కూల్చి కరెంటు పోల్స్ ఏర్పాటు
శ్రీ లక్ష్మీ గాయత్రి ఫాం ల్యాండ్ యాజమాన్యం రేకిత్తించిన ఆశలతో లాభాలు ఆర్జించోచ్చు అనే ఆశతో కరీంనగర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజిలో తాత్కాలిక ఉద్యోగి లక్షల రూపాయలు వెచ్చించి ప్లాటు కోనుగోలు చేశారు. ఆ ప్లాటు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు చుట్టు చిన్నగా ప్రహరి నిర్మాణం చేసుకున్నాడు. అయితే అందులోనే ప్లాటు ఉన్న ఇరిగేషన్ శాఖలో పనిచేసే ఉద్యోగి అక్రమంగా నిర్మించిన రిసార్ట్ కు కరెంటు తరలించేందుకు సదరు ఉద్యోగి ప్లాటు చుట్టు నిర్మించుకున్న ప్రహరీని కూల్చి ప్లాటు లోపల అక్రమంగా పోల్స్ పాతారు. సమాచారం తెలియడంతో అక్కడికి వెల్లి సదరు అధికారిని నా ప్లాటులో కరెంటు పోల్స్ ఎలా ఏర్పాటు చేస్తారంటూ ప్రశ్నించడంతో ఆగ్రహించిన సదరు అధికారి నన్నే ప్రశ్నిస్తావా నీవు మూడు ఫీట్లు ముందుకు జరిగావు.. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని హెచ్చరించడంతో ఖంగుతిన్న ఉద్యోగి విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి నెలరోజులు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో సదరు ఉద్యోగి న్యాయం కోసం నేటికి అధికారుల చుట్టూ తిరుగుతుండటం అక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది
విద్యుత్ కనెక్షన్ అక్రమమా? సక్రమమా?
ఫాం లాండ్ పేరిట రంగు రంగుల బ్రోచర్లు ముద్రించి కస్టమర్ల కు కుచ్చుటోపి పెట్టిన శ్రీ లక్ష్మీ గాయత్రి ఫాం ల్యాండ్ యాజమాన్యం ఆ భూముల్లో మొక్కలు నాటి లాభాలను అందించకుండా అక్రమ నిర్మాణాలకు తెరలేపి కొందరు అధికారులకు అండగా నిలుస్తూ అమాయకుల నోరుమూపిస్తుంది. అయితే అధికారులు సైతం నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడం ఆ అనుమతులను చూపి కరెంటు కనెక్షన్ల పేరిట పక్క ప్లాట్ల యజమానులపై అరాచకం సృష్టించడంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ భూముల్లో వ్యవసాయేతర కరెంటు కనెక్షన్లు ఇవ్వడం చట్ట విరుద్దం అయినప్పటికి ఇష్టానుసారంగా కరెంటు కనెక్షన్లు ఇవ్వడంతో ఆ కనెక్షన్లు చట్టబద్దమేనా.. లేక నిబంధనలకు విరుద్దంగా మంజూరు చేసిన కనెక్షన్ల అనే సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.






