- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీ5 క్యాంపు పనులను అడ్డుకున్న రాజాపూర్ గ్రామస్తులు
రామగుండం 3 ఏరియా ఓసీ2 విస్తరణలో భాగంగా ఓబీ(మట్టి తరలింపు) పనులు నిర్వహిస్తున్న సీ5 క్యాంపును ఆదివారం రాజాపూర్ గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఎక్కడిక్కడ పనులు నిలిచిపోయాయి.

దిశ, రామగిరి : రామగుండం 3 ఏరియా ఓసీ2 విస్తరణలో భాగంగా ఓబీ(మట్టి తరలింపు) పనులు నిర్వహిస్తున్న సీ5 క్యాంపును ఆదివారం రాజాపూర్ గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఎక్కడిక్కడ పనులు నిలిచిపోయాయి. ఓసీ2 విస్తరణలో భాగంగా రాజాపూర్ గ్రామాన్ని సింగరేణి సంస్థ రాజాపూర్ గ్రామాన్ని సేకరిస్తున్న విషయం విదితమే. దీనిలో భాగంగా గ్రామంలో ఇళ్లకు నెంబర్లను కూడా కేటాయించారు. రాజాపూర్ గ్రామస్తులు మాట్లాడుతూ అధికారులు అర్హులైన వారికి కూడా టెంపరరీ నెంబర్లను కేటాయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. టెంపరరీ నెంబర్లు కేటాయించిన ఇళ్ల గురించి, ఇతర సమస్యల గురించి ఇప్పటికే పలుమార్లు మంత్రి శ్రీధర్ బాబుకు, సంబంధిత అధికారులకు విన్నవించినట్లు గ్రామస్తులు తెలిపారు.
సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికి వారు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పర్మినెంట్ నెంబర్లను కేటాయించిన ఇండ్లకు నష్టపరిహారం చెల్లిస్తామని, టెంపరరీ నెంబర్లను కేటాయించిన విషయంలో నష్టపరిహారం చెల్లించేది లేదని తర్వాత ఏం చేయాలో మాకు తెలుసన్న ధోరణిలో అధికారులు మాట్లాడుతున్నారని గ్రామస్తులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అలాంటప్పుడు ఇళ్లకు నెంబర్లను ఎందుకు కేటాయించారని, టెంపరరీ నెంబర్లు ఉన్న ఇళ్లకు పర్మినెంట్ నెంబర్ ఇచ్చి పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సింగరేణి సంస్థ కారణంగా ఎన్నో సంవత్సరాలుగా రైతు బంధు, రైతు బీమా కోల్పోయామని అన్నారు. అయినప్పటికీ గతేడాది గ్రామానికి సంబంధించిన 88 ఎకరాలను తీసుకుని ఉపాధి కల్పిస్తామన్నారని, ఇప్పటికి అది కూడా అమలు కావడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని గ్రామస్తులు విన్నవించారు.






